ABVP నాయకుల ఆమరణ నిరాహారదీక్ష
జిల్లా కేంద్రంలోని మహిళ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడకు అనుకోని షెడ్ల నిర్మాణాలు వెంటనే ఆపివేయాలని ఏబీవీపీ నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు.ఈ సందర్బంగా ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు నాయకుల మెడలో పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ నగర సంఘటన కార్యదర్శి జంగిలి వెంకట్ మాట్లాడుతూ మహిళ డిగ్రీ కళాశాలకు అనుకొని షెడ్ల నిర్మాణాన్నీ ఆపాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గత 3 నెలలుగా ఉద్యమం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక్కడ షెడ్ల నిర్మాణం చేపడితే మహిళ విద్యార్థినిలకు పోకిరిలా బెడద ఉంటుందని,అసంగీక కార్యకలాపాలు జరుగుతాయన్నారు.వెంటనే షెడ్ల నిర్మాణాన్ని ఆపేస్తున్నట్లు కలెక్టర్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని,కళాశాల ప్రహరీ గోడకు అనుకోని ఫించింగ్ వేయాలని డిమాండ్ చేశారు. ఆమరణ దీక్షలు వివిధ పార్టీల నాయకులు,ప్రజా,విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నరేందర్,ఏబీవీపీ నాయకులు రవి, మనోహర్,అక్షయ్,కార్తిక్,సాయి తేజ,ప్రమోద్,ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు మనోజ్ ,సురేందర్,ప్రశాంత్,నిఖిల్ పాల్గొన్నారు.