తెలంగాణలో హంగ్ వస్తుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. హంగ్ వస్తుందనడమే కాదు… బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవక తప్పదనీ ఆయన అన్నారు.
” వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకికూడా 60 సీట్లు రావు. హంగ్ అసెంబ్లీ వస్తుంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, భారాసా సెక్యులర్ అంటే ఆయన కేసీఆర్ ఎవరితో కలవాలి. కాంగ్రెస్ పార్టీని ఆయన పొగిడిండు కూడా. మేం అయినా, బీఆర్ఎస్ అయినా బీజేపీతో కలవలేం కదా.. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఐక్యంగా పనిచేస్తేనే మంచిఫలితాలు వస్తాయి” అని కోమటిరెడ్డి అన్నారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలు పార్టీ కేడర్‌ను గందరగోళ పరిస్థితిలోకి నెట్టేలా ఉన్నాయని పార్టీ నేతలు వీహెచ్, అద్దంకి దయాకర్, శ్రీధర్ బాబు, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు అన్నారు. ఆయనపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని వారన్నారు.
https://twitter.com/TV9Telugu/status/1625393753853927424?s=20&t=k3UPIDdk-rGH6OgC3YkZzg
తెలంగాణలో హంగ్ వస్తుంది – దుమారం రేపుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు

Share: