సముద్ర జలాల మీదుగా పెద్ద ఎత్తున తరలిస్తున్న డ్రగ్స్ ముఠాను భారతీయ కోస్ట్ గార్డ్ దళం పట్టుకుంది. 6 వేల కిలోలకు పైగా మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. రెండు కిలోల మాదక ద్రవ్యాలను ఒక ప్యాకెట్ గా ప్యాక్ చేసి మొత్తం మూడు వేల ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత తీర రక్షక దళం ఇప్పటివరకు జరిపిన మాదకద్రవ్యాల రవాణాలో ఇదే అతిపెద్దదని రక్షణ అధికారులు తెలిపారు.
“అండమాన్ జలాల్లో ఫిషింగ్ బోట్ నుండి దాదాపు ఆరు టన్నుల డ్రగ్స్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. భారత తీర రక్షక దళం ఇప్పటివరకు జరిపిన మాదకద్రవ్యాల రవాణా పట్టివేత లో ఇదే అతిపెద్దది., ”అని రక్షణ అధికారులు తెలిపారు.
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని దీవుల మీదుగా ఈ డ్రగ్స్ రవాణా జరుగుతున్నది. అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న బోట్లను తనిఖీ చేస్తున్నప్పుడు,, ఒక బోట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ బలగాలు.. ఆ బోట్ ను తరిమి తరిమి పట్టుకున్నాయి. ఆ బోట్ ను తనిఖీ చేసినప్పుడు భారీగా మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేశారు