ముందు కోవిన్ పోర్టల్ (cowin.gov.in)లో లాగిన్ అవ్వాలి…మొబైల్ నెంబర్ నమోదు చేయగానే ఫోన్ కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. ఓకే అయితే
‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వాక్సినేషన్ ‘పేజ్ ఓపెన్ అవుతుంది
అందులో ఫొటోతో కూడిన ఏదైనా గుర్తింపు కార్డు, పేరు, పుట్టినతేదీ వంటి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయాలి .
ఒకసారి రిజిస్ట్రేషన్ అవగానే , టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకోవచ్చు. అందుకోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్ క్లిక్ చేయాలి.పిన్ కోడ్ ఎంటర్ చేసి వెతికితే ఆ ఏరియా పరిధిలో ఉన్నటీకా కేంద్రాల జాబితా వస్తుంది. అప్పుడు తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ బటన్ క్లిక్ చేయాలి.
ఒక్క లాగిన్ పై నలుగురికి అపాయింట్ మెంట్ తీసుకోవచ్చు. తేదీలు మార్చే వెసులుబాటు కూడా ఉంది. ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.