వీళ్ళు భజన చేసే మెచ్చే నెహ్రూ, ఇందిరా పరివారం వల్లే స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి అన్ని వచ్చాయి చెప్తారు కదా! ఆ పరివారమే కదా ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించారు. భారత్ కి ఒలింపిక్స్ లో మెడల్స్ రాలేదు అంటే ఆటలకు సరి అయిన ప్రోత్సాహం ఇవ్వని వారి విధానాలు కూడా తప్పు అనే అనుకోవాలి కదా!
పోనీ ఆ సంగతి పక్కన పెడదాం.. వీళ్ళు 35 సం.లు అప్రతిహంగా పాలించిన పశ్చిమ బెంగాల్ ఫుట్ బాల్ ఆటకు దేశంలో ప్రసిద్ది. 1948 నుండి 1960 ఒలింపిక్స్ వరకు ఏ మెడల్ సంపాదించలేకపోయినా భారత్ పుట్ బాల్ టీమ్ కనీసం ఆటల్లో పాల్గొనడానికి అర్హత సంపాదించేది.
కానీ పశ్చిమ బెంగాల్ లో మన కమ్యునిస్ట్ పాలన మొదలైన తరువాత ఆ 35 సం.లలో భారత్ ఫుట్ బాల్ టీమ్ కనీసం ఒక్క ఒలింపిక్స్ లో పాల్గొనే అర్హత కూడా సంపాదించలేదు. బెంగాల్ ప్రజలు ఫుట్ బాల్ ఆట అంటే ప్రాణం పెడతారు. అటువంటి ప్రజల్లో కూడా ఆ ఆటలో అంతర్జాతీయ పతకాలు సంపాదించాలి అనే స్ఫూర్తి కలిగించలేకపోయారు. కారణం ప్రజల్లో జాతీయ వాదం, దేశభక్తి నీ చంపేసే మీ దిక్కుమాలిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వల్లే.
వాళ్ళు 35 సం.ల పశ్చిమ బెంగాల్ పాలనలో అంతర్జాతీయ స్థాయి కలిగిన క్రీడాకారులను తయారుచేయద్దు అని ఎవరు చెప్పారు? దానికి కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా?
ఇంత చిన్న విషయంలోనే ఇప్పుడే చైనా బూట్లు ఇంతలా నాకుతున్నారు అంటే 1961 లో భారత్ మీద చైనా గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారేమో కూడా?
ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ తిండి తింటూ శత్రు రాజ్యంతో పోలుస్తూ ఈ దేశాన్ని చులకన చేయడం చూస్తే వీళ్ళ DNA లోనే ఏదో లోపం వుంది అని అనిపిస్తోంది.
రెండు కుటుంబాల్లో పెళ్ళిళ్ళు ఒక్క సారి అయినా వాడి కుటుంబంలో 100 మంది పిల్లలు ఉన్నారు నీ కుటుంబంలో లేరు అని నువ్వు వెక్కిరించుకుంటున్నావు అంటే ఆ కుటుంబసభ్యుల లో నువ్వు కూడా భాగం అనుకుంటే ఇటువంటి నపుంసక ఆలోచనలు రావు.
Opinion : చాడా శాస్త్రి