కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తిరగబెడుతోంది. ప్రధానంగా సాంక్రమిక శక్తి అత్యంత ఎక్కువ ఉన్న డెల్టా రకం కరోనా వైరస్ కమ్మేస్తోంది. దీని దెబ్బకు ఇప్పుడు ‘డ్రాగన్’ అల్లాడుతోంది. చైనా వ్యాప్తంగా 18 ప్రావిన్సుల పరిధిలోని 27 నగరాలకు వ్యాపించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక నెలలుగా కొవిడ్ కట్టడిలో విజయవంతమైన చైనాను తాజా ఉద్ధృతి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మధ్యస్థాయి, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల సంఖ్య 95 కి పెరిగినట్లు అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ తెలిపింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక్కసారిగా కొవిడ్ మహమ్మారి విజృంభించింది. ఇంతవరకు ఎన్నడూలేని విధంగా 24 గంటల్లో 21,683 కొత్త కేసులు బయటపడ్డాయి. అమెరికాలో ఒక రోజులో బయటపడిన కేసుల్లో ఐదో వంతు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అంతకు ముందు రోజు ఫ్లోరిడాలో 17,093 కేసులు బయటపడ్డాయి. ఇక్కడా డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉంది ఈమేరకు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శనివారం వివరాలను వెల్లడించింది. ఫ్లోరిడాలో వేడి పెరగడంతో ఎక్కువ మంది ఇళ్లలో ఏసీలు వేసుకుని ఉంటున్నారని.. దీనివల్లే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని గవర్నర్ రాన్ డీసంటిస్ అభిప్రాయపడ్డారు.
ఇక మనదేశంలో పరిస్థితి గమనిస్తే
గడచిన ఒకటిన్నర సంవత్సరాలకాలఖండంలో కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎందుకంటే నివారించటం అనేది ఎంతవరకు సాధ్యమో ఎవరూ చెప్పలేకపోతున్నారు.శాస్త్రపరిశోధనలో ముందుఉన్నఅమెరికా చైనా దేశాలు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి , భారత్ లో కూడా ఇంకా స్పష్టత రాలేదు అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నది, ఈ పరిస్థితుల్లో దానిని అదుపు చేయడానికి తీసుకున్న చర్యలవల్ల ఫలితం ఉన్నది అనేది కనబడుతున్నది. మొదటి వేవ్ సమయం లో 1) వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2) లాక్ డౌన్ కొన్నినెలలు కొనసాగింది దాంతో పరిస్థితులు కొంతమేరకు అదుపులోకి వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తి వేసిన తరువాత ప్రజల అజాగ్రత్త, ఏమరపాటు కారణంగా రెండవ లో ఎక్కువ నష్టపోయాం. దానికి పాలకులు పరస్పర నిందారోపణలు చేసుకోవటం చూసాము. రెండో వేవ్ లో రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకుని మళ్లీ లాక్ డౌన్ విధించటం కారణంగామొత్తానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి, మళ్లీ ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రక్క మూడో వేవ్ గురించి విస్తృత ప్రచారం జరుగుతుంటే గడిచిన మూడు వారాల నుండి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలోతాజాగా 30,549 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.17కోట్లకు చేరాయి. కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసులు భారీగా పడిపోవడమే ఈ తగ్గుదలకు కారణం. గడిచిన 24 గంటలలో 422 మంది మరణించారు , నిన్నటి రోజున 40 4230 కేసులు గుర్తించబడ్డాయి.
కొన్ని రాష్ట్రాలుమళ్ళి లాక్ డౌన్ విధించే ప్రయత్నంలో ఉన్నారు, ప్రజలు చాలా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు, వ్యాపార సంబంధ వస్తువుల ఉత్పత్తి మందగించిన కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది , ఈ సమయంలో సమస్యల్లో చిక్కుకున్న వారి లో మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి, దాంతో ఆత్మహత్యలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావటం జరుగుతోంది కోవిద్-19 సమస్య ఎప్పటికి ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు స్వేచ్ఛగా ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవటంలో ఎక్కడో తేడాలు వస్తున్నాయి , దానితో ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు కనబడటం లేదు.ఇది ఒక పెద్ద ప్రశ్న, ఈ సమయంలో మనంపరిస్థితులను పరిగణలోకి తీసుకోవటం అలవాటు చేసుకోని జాగ్రత్తగా ఉండాలి.
కోవిడ్ పూర్తిగా ఈ ప్రపంచం వదిలి వెళ్లడం అనేది జరిగే పని కాదు, ఇది క్రమంగా ఫ్లూ , సాధారణ జలుబు రూపంలో ఉండిపోయేట్లుగా ఉన్నది, వైరస్ సజీవంగానే ఉండే అవకాశం కనబడుతోంది, ఇక్కడే ఇంకొక సమస్య గుర్తించాలి, వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి వ్యాక్సిన్ వేసుకుంటే కోవిద్ రాదు అని చెప్పలేం, అయితే వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా మనం ప్రమాదం అంచుల్లో కి పోకుండా బయటపడవచ్చు. కొత్త కేసులు పెరగవచ్చు కానీ మరణాల రేటు తగ్గిపోతుంది. మనదేశంలో వ్యాక్సిన్ వేగం గా వేయడం జరుగుతున్నది. అలాగే ఇప్పటివరకు47,85,44,114 డోసులు పంపిణి జరిగింది, నిన్న 61లక్షల మంది టీకా వేయించుకున్నారు.
అయితే పూర్తి వ్యాక్సినేషన్ కాని కారణంగా మనం మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది ఇళ్లలో ఉండటం, బయట గుంపులు గుంపులుగా తిరగకుండా ఉండాలి , ఎక్కడ ఉన్న మాస్కు ధరించాలి , వ్యాక్సిన్ వేసుకోవాలి, వ్యాక్సిన్ వేసుకోని వారిలో వ్యాధి ప్రమాదకరంగా కనపడుతోంది జాగ్రత్తలతో ఉండాలని ప్రభుత్వాలు చెబుతాయి , కానీ ప్రజలు తమకు తాము ఆలోచించుకొని దానికి అనుకూలంగా ఉండటం అవసరం, వ్యాక్సిన్ వేయించుకోవడం తమను తాము రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం, ఈ ప్రయత్నాలతో కోవిడ్ ప్రమాదాలను కొంత అదుపులో ఉంచే అవకాశం ఉంది.