కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ అయోధ్యను సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ పనుల పురోగతి గురించి ఆయనకు వివరించారు. ఇంకా పలువురు ట్రస్టు సభ్యులు, వీహెచ్పీ ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంగణంలో మొక్కను కూడా నాటారు హోంమంత్రి.