ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్ లోయ వణికిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా కశ్మీర్ ను వీడుతున్నారు. శుక్రవారం అందరూ ఆ ప్రాంతాన్ని వీడివెళ్లాలని నిర్ణయించారు. 1990 నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తవచ్చని భయపడుతున్నారు. గురువారం కుల్గామ్ జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే. 4,000 మందికి పైగా పండిట్ ఉద్యోగులు లోయను విడిచిపెట్టాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. లోయలోనుంచి మరోసారి భారీ వలసలు తప్పేట్టు లేదు. లోయను విడిచి పెట్టేందుకు సిద్ధమైన హిందువుల వీడియోలు బయటకు వచ్చాయి. భద్రతా సిబ్బంది కాపలా ఉన్న వివిధ ట్రాన్సిట్ క్యాంపుల వద్ద నివసిస్తున్న ఉద్యోగులు కూడా నిరసనను విరమించి జమ్మూకు బయలుదేరాలని నిర్ణయించారు.
https://twitter.com/republic/status/1532275649456779265?s=20&t=DcCrgQQjhYhFMaG5MDRR6Q
కశ్మీరీ మైనారిటీ ఫోరమ్ శుక్రవారం ఉదయం నాటికి లోయలోని మైనారిటీలను వలస వెళ్లాలని ఈమేరకు ప్రకటన జారీ చేసింది. విజయ్ కుమార్ హత్య తర్వాత సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించింది. కశ్మీర్లోని అన్ని ప్రాంతాల్లో నిరసనలు తక్షణమే ఆపాలని వారు నిర్ణయించారు. లేదంటే తమ జీవితాలు ఉగ్రవాదుల తూటాలకు బలికావాల్సిందేనని వారంతా మూకుమ్మడిగా భయాన్ని వ్యక్తం చేశారు. మైనారిటీలమైన తాము అక్కడ జీవించలేమని…అందుకే లోయ వదిలివెళ్తామని వారంటున్నారు. తమ భవిష్యత్తుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం నావిగ్ టన్నెల్ బయట అందరూ సమావేశమవ్వాలని నిర్ణయించారు.
ది ట్రిబ్యూన్ బారాముల్లాలోని హిందూ కాశ్మీరీ పండిట్ కాలనీ నాయకుడు అవతార్ క్రిషన్ భట్ అయితే మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. తాము ఎప్పటికైనా లోయనువీడవచ్చని.. అందుకే ట్రక్కులను సిద్ధంగా ఉంచుకున్నామని చెప్పారు. వరుస హత్యలతో తాము వణికిపోతున్నామని ప్రభుత్వం తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆయ కోరారు.
https://twitter.com/news24tvchannel/status/1532288914534170624?s=20&t=JFYEcQsSSbQ0UzvcnkFyTQ
కాశ్మీరీ హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం ఇటీవల పెరగడం, ముఖ్యంగా లోయలోని ఇస్లామిక్ ఉగ్రవాదులు …PM ప్యాకేజీ కింద నియమించబడిన వారితో సహా లోయను విడిచిపెట్టాలనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల్లో లోయలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒక హిందువును లక్ష్యంగా చేసుకోవడం నాలుగోసారి.
https://twitter.com/MattLaemon/status/1532300195790147584?s=20&t=U8ZZKxGDZkv_MKUSdXeL-w