జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో హిందీ భాషను తొలగించడం వివాదాస్పదం అవుతోంది. హిందీతో పాటు సంస్కృతాన్నీ తొలగించి ఉర్దూను మాత్రం జాబితాలో ఉంచారు. మొత్తం 12 భాషల్లో ఏదో ఒక లాంగ్వేజ్ పేపర్ ను అభ్యర్థి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానంలో సంస్కృతం, హిందీలను తొలగించారు. బోజ్ పురి, అంగిక భాషల్నీ జాబితాలో చేర్చలేదు. హిందీని తొలగించి ఉర్దూను ఉంచడంపై అభ్యర్థులనుంచి నిరనస వ్యక్తం అవుతోంది.