పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి బదులిచ్చారు అసోం సీఎం హిమంత బిస్వాశర్మ. ట్విట్టర్ వేదిగ్గా సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించిన వీడియోను షోర్ చేస్తూ తెలంగాణ సీఎంను ట్యాగ్ చేశారు.
“ప్రియమైన కేసీఆర్ గారూ, మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం ఇదిగో. ఇంత జరిగినా, మీరు మన సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తూ వారిని అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి ఎందుకు మీకంత తహతహ? ‘సైన్యంపై అవమానాలను నయాభారత్ సహించదు’ అని శర్మ ట్వీట్ చేశారు.
https://twitter.com/himantabiswa/status/1493140158316937216?s=20&t=NgfNV3WWvp05vEaHlOOB3Q