అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వకర్మ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మణిపూర్ , నాగాలాండ్ సీఎంలు ఎన్.బీరేన్ సింగ్, నెయిఫియు రియో సహా పలువురు నాయకులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. హిమంతతో పాటు 13మంత్రి మంత్రులుగా ప్రమాణ చేశారు.
అస్సాం అసెంబ్లీలో 126 స్థానాలకు గానూ ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా… బీజేపీ సొంతంగా 60 సీట్లు సాధించింది.
ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అసోం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు హిమంత…“నా మీద మీకున్న విశ్వాసానికి కృతజ్ఞత్రుడను. అసోం ప్రజల కోసం అందర్నీ కలుపునిపోతూ పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ” అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్ వేదిగ్గా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మీరు నాపై పెట్టుకున్న విశ్వాసానికి ధన్యుడను. మీరు నన్నెంతగానే ప్రోత్సహించారు. ఆశీర్వదిస్తున్నారు. ఇది నాజీవితంలో మరిచిపోలేని ముఖ్యమైన దినం. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధివైపు తీసుకెళ్లాలనే మీ సంకల్పం మాకు తెలుసు. అందుకు నావంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.