అమరవీరుడు, తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్రను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సతీష్ బాబు సతీమణి, తల్లి అవార్డును అందుకున్నారు. గత ఏడాది లద్దాక్ .. గాల్వన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరులో సంతోష్ అమరుడయ్యారుయ ఆపరేషన్ స్నో లియోపార్డ్ సందర్భంగా…శత్రువులను తుదముట్టిస్తూ తానూ తుదిశ్వాస విడిచారు.
తన పోస్టుపై దాడి చేసిన చైనా సైనికుల్ని కల్నల్ సంతోష్ ధీటుగా ఎదుర్కొన్నారు. కల్నల్ సంతోష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ 5 కోట్లు ఇచ్చింది. సంతోష్‌బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంతో పాటు హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో 700 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చింది తెలంగాణ సర్కారు.
ఇంకా జమ్మూకశ్మీర్‌లోని కీరణ్ సెక్టార్లో ఉగ్రవాదులను చంపిన పారా స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన సుబేదార్ సంజివ్ కుమార్‌కు మరణానంతరం కీర్తి చక్రను ప్రదానం చేశారు. సుబేదార్ సంజీవ్ భార్య ఈ అవార్డును అందుకున్నారు. గాల్వన్ లోయలో చైనా దళాతో ఘర్షణపడ్డ నాయక్ సుబేదార్ నుదూరమ్ సోరెన్‌కు మరణానంతరం వీర చక్రను ప్రదానం చేశారు.
లడాఖ్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన హవిల్దార్ కే పళనికి మరణానంతరం వీర చక్రను ప్రదానం చేశారు. గాల్వన్ యోధుడు నాయిక్ దీపక్ సింగ్‌కు మరణానంతరం వీర చక్రను, నాయిక్ దీపక్ సింగ్‌కు వీరచక్రను, సిపాయి గుర్జీత్ సింగ్‌కు వీరచక్ర అందజేశారు.