క్రైస్తవ చర్చి లు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నాయి. అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకొని బలవంతంగా మతమార్పిడులకు దిగుతున్నాయి. దీంతో ఛత్తీస్ గడ్,, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో కొత్త విప్లవం బయలుదేరింది. బలవంతంగా, మోసపూరితమైన
మతమార్పిడి చేస్తున్న పాస్టర్లకు తమ గ్రామాలలో ప్రవేశం లేదు అని స్థానిక గిరిజనులు బోర్డులు పెడుతున్నారు. ఇప్పుడు ఇది కలకలం రేపుతోంది.
……………….
ఈ హోర్డింగ్లపై దాఖలైన పిటిషన్ను ఛత్తీస్ ఘడ్ హైకోర్టు కొట్టివేసింది. ప్రలోభపెట్టడం లేదా మోసపూరిత మార్గాల ద్వారా బలవంతపు మతమార్పిడిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ హోర్డింగ్లు స్థానిక తెగల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి ముందస్తు జాగ్రత్త చర్యలని పేర్కొంది. గ్రామసభలు తమ ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు పీఈఎస్ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పిటిషనర్ ఈ హోర్డింగ్లు క్రైస్తవ సమాజాన్ని వేరుచేస్తున్నాయని వాదించారు.,
గిరిజనులకు చత్తీస్గడ్ ప్రభుత్వం మద్దతు తెలిపింది.
ఈ చర్యలు అక్రమ మతమార్పిడిని అరికట్టడానికే పరిమితం అని ప్రభుత్వం తెలిపింది.
గిరిజన సంప్రదాయాలపై బలవంతపు మతమార్పిడుల ప్రభావం పడుతున్నదని తెలియ చేసింది.
బలవంతపు మతమార్పిడుల వల్ల గిరిజన గ్రామాల్లో సామాజిక విభేదాలు, కుటుంబ విభజనలు, వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వ వాదనలో పేర్కొన్నారు. మతం మారిన వారిపై తిరస్కారం, శాంతిభద్రతల లోపం వంటి అంశాలు నమోదయ్యాయని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో గ్రామసభలు ఏర్పాటు చేసిన హోర్డింగ్లు ప్రజల మధ్య అవగాహన కలిగించడానికే అని హైకోర్టు పేర్కొంది. “ప్రలోభపెట్టడం లేదా మోసపూరిత మార్గాల్లో మతమార్పిడి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదు,” అని తీర్పు తెలిపింది. ఇది రాజ్యాంగపరమైన అంశం కాబట్టి,, చత్తీస్గడ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశం అంతా వర్తిస్తుంది అని గమనించాలి.




