అమరావతి: ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గవర్నర్తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై సీబీఐ విచారణ జరపాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. ఓ రాజ్యాంగబద్ధ సంస్థ అధిపతినైన తాను గవర్నర్ కార్యాలయానికి రాసిన లేఖను…లీక్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్లో … మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలతో పాటు గవర్నర్ కార్యదర్శినీ ప్రతివాదులుగా చేర్చారు.