పలు దక్షిణాది భాషాచిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీనా భర్త కన్నుమూశారు. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ నిన్న రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యాసాగర్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. మీనా, విద్యాసాగర్ 2009లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి నైనిక అనే కుమార్తె ఉంది. ఈ పాప కూడా ఇప్పటికే సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్ హీరో విజయ్ తెరి సినిమాలో ఆయన కుమార్తెగా నటించింది నైనికానే.
ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. 2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి కరోనా అంటూ జనవరిలో మీనా సోషల్ మీడియా పోస్ట్ కూడా చేశారు. కోవిడ్ నుంచి మీనా, నైనిక కోలుకున్నారు. కానీ విద్యా సాగర్‌కు పోస్ట్ కోవిడ్ సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయన శ్వాస వ్యవస్థ బాగా దెబ్బ తిన్నదని సమాచారం.