తెలుగునాట అప్పుడప్పుడు నిర్మాతలతో హీరోయిన్లకు లడాయి పడుతుంది. ముఖ్యంగా పారితోషికం చెల్లింపు విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కమిట్మెంట్ ప్రకారం పూర్తి డబ్బులు రాలేదని హీరోయిన్స్ చెబుతుంటే,, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చామని నిర్మాతలు వాదిస్తుంటారు. తాజాగా అందాల భామ పాయల్ రాజ్ పుత్ కూడా ఇలాగే గొడవ పడు తున్నారు. రక్షణ సినిమా విషయంలో నిర్మాతలు బెదిరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలుగు సినిమా నుంచి గెంటేస్తామంటూ నిర్మాతలు బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు.
ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా పాయల్ రాజ్ పుత్ బాగా పాపులర్ అయ్యారు. రక్షణ సినిమా కూడా సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది..
సోషల్ మీడియాలో తన కష్టాలను ప్రస్థావిస్తూ సుదీర్ఘ లేఖను ఆమె షేర్ చేశారు. సినిమాను ప్రమోట్ చేయకపోతే తెలుగు సినిమాల నుండి నిషేధిస్తానని రక్షణ మేకర్స్ బెదిరించారని ఈ లేఖలో స్పష్ఠంగా పేర్కొంది. ఇటీవల ఓ సమావేశంలో రక్షణ నిర్మాతలు తనపై అనుచితమైన భాషను ఉపయోగించారని, ఒక పంపిణీదారు తప్పుడు విధానంలో మాట్లాడారని సోషల్ మీడియా నోట్ లో పాయల్ ఆరోపించింది.
నిజానికి రక్షణ సినిమా ఇప్పటిది కాదు.
2019 – 2020లో చిత్రీకరించిన చిత్రం రక్షణ.
“ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ఇప్పుడు వారు బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్స్‌కి పిలవకుండా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల నేను పొందిన పాపులారిటీ నుంచి ప్రయోజనం పొందేందుకు రక్షణ సినిమా టీం ప్రయత్నిస్తున్నారు. ముందస్తు కమిట్మెంట్ల కారణంగా నేను బిజీగా ఉన్నాను. కానీ వారు తెలుగు సినిమా నుంచి నన్ను బ్యాన్ చేస్తామని బెదిరించారు.
ముందుగా నష్టపరిహారంతో బకాయిలను క్లియర్ చేయమని సూచించాం. అయినప్పటికీ వారు రాజీకి నిరాకరించారు. నా ప్రతిష్టను దిగజార్చే విధంగా నా పేరును ఉపయోగించారు.. ఇది ఆమోదయోగ్యం కాదు!” అని పాయల్ ఆరోపించారు. తన బకాయిలను క్లియర్ చేయకుండా, తన అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నందున మేకర్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఈ నోట్ లో రాసింది.
మొత్తం మీద డబ్బులు రాబట్టుకోవాలని పాయల్ రాజ్ పుత్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీగా మారారు. దీంతో ఈ పాపులారిటీ వాడుకుంటూ రక్షణ సినిమా ను పాపులర్ చేసుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.