T-ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా… ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లకే ఛేదించింది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ ఓటమితో టీమిండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.