
File Photo
న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని..సీబీఐ విచారణకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీబీఐకి లేఖ రాసిన కవిత… వెబ్సైట్లో ఎఫ్ఐఆర్, ఫిర్యాదు అని ఉన్నట్టుందని….అయితే నిందితుల జాబితా, ఫిర్యాదును పరిశీలించానని ఎక్కడా తన పేరులేదని అన్నరు. అలాగే ముందు అనుకున్నట్టు ఈనెల 6న సీబీఐని కలవలేనన్న కవిత ముందే కార్యక్రమాలు ఖరారవడమే కారణమన్నారు.ఈ నెల 11,12,14,15 తేదీల్లో మాత్రం అందుబాటులో ఉంటానన్నారు. ఆ సీబీఐ రావొచ్చని లేఖలో పేర్కొన్న కవిత…విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు.