హస్యబ్రహ్మ శంకరనారాయణ జీవితం ఓ తెరిచిన పుస్తకం వంటిది. ఆయన జీవితంపై గుంటూరుకు చెందిన న్యాయవాది చొప్పరపు శ్రీనివాస్‌రావు పరిశోధన చేశారు. ఇందుకుగాను ఆచార్య నాగార్జున యూనవర్సిటీ పీహెచ్డీ పట్టాను ప్రదానం చేసింది. హాస్యబ్రహ్మ శంకరనారాయణ జీవితం-రచనావిన్యాసాలు అనే అంశం మీద శ్రీనివాసరావు పరిశోధన చేసినందుకు గాను ఈ పురస్కారం అందుకున్నారు. హస్యావధానిగా.. హాస్య రచయితగా శంకరనారాయణ సుప్రసిద్దుడని తెలిపారు. అంతేకాదు.. ఆయన ఓ సీనియర్ జర్నలిస్టు అని శ్రీనివాసరావు తెలిపారు. ఇక నాగార్జున విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు తొలి బ్యాచ్ విధ్యార్ధి శంకరనారాయణ అని పేర్కొన్నారు. ఎం.ఏ తెలుగుతో సహా 5 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలున్న తాను తెలుగు సాహిత్యం, హాస్యం మీద ఉన్నఅభిరుచితో ఈ పరిశోధన సాగించినట్లు న్యాయవాది శ్రీనివాసరావు తెలియజేశారు.