‘ఏందిరా బై ఇక్కడ ఇద్దరం మంత్రులం, ఓ ఎమ్మెల్యే ఉన్నాం..తోసుకుంటూ వస్తున్నావ్..కండ్లు కనపడటం లేదా..నువ్వు బయటకు పో’….
ఓ వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్ రావు అన్న మాటలివి.
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో ఏర్పాటుచేసిన బస్తీ దావాఖానా ఓపెనింగ్ కు మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తో కలసి హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధికారులు వచ్చారు. ఈ క్రమంలో జిల్లా వైద్యాధికారి కోటాచలం కొంత హడావుడి చేశారు. మంత్రులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా హరీష్ ఈ మాటలన్నారు. దీంతో డీఎంహెచో కోటాచలం కొంత వెనక్కి తగ్గారు.
వైద్యాధికారిపై హరీశ్ ఆగ్రహం..

Share: