ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న హిందువులకు అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ శుభాకాంక్షలు తెలిపింది. “చీకటి నుండి జ్ఞానం, జ్ఞానం నుంచి సత్యం వైపు వెళ్లాలనే సందేశాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుందని… విభజన నుంచి ఐక్యత … నిరాశ నుంచి ఆశను దీపావళి ఇస్తుందని ప్రెసిడెంట్ బైడెన్ ట్వీట్ చేశారు. ” అమెరికాలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేను కాంతి, ప్రేమ మరియు శ్రేయస్సుతో నిండిన ఈ దినం సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని కమలా ట్వీట్ చేశారు.