జ్ఞానవాపి మసీదు నిర్మాణం క్రింద హిందూ దేవాలయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను స్పష్టం చేస్తూ కొత్త వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో బయటపడ్డాయి. మసీదు లోని వుజుఖానా లో శివలింగం, స్వస్తిక, త్రిశూలం, కమలం సహా హిందూ దేవతల గుర్తులు బేస్ మెంట్ గోడలపై కనిపించాయి. జ్ఞానవాపి మసీదులోని వుజుఖానా లోపల తీసిన వీడియోలో హిందూ పక్షం ఆరోపిస్తున్న శివలింగాన్ని పోలి ఉండే నిర్మాణాన్ని చూపుతోంది. శివలింగం తోపాటు మసీదు బేస్ మెంట్ లోని విజువల్స్ కూడా త్రిశూలం, స్వస్తికలు సహా హిందూ గుర్తులను చూపుతోంది. మసీదును హిందూ దేవాలయంపై నిర్మించారనే హిందూ పక్షం ఆరోపణలను ఈ వీడియో లోని సంకేతాలు బలపరుస్తున్నాయి.
https://twitter.com/Zee_Hindustan/status/1531296709179240454?s=20&t=Z65bdTHyTaGajuzB0Qv5rA
ఫోటోలు, వీడియోలతో సహా జ్ఞానవాపి సర్వే నివేదికను అందజేయాలని కోరిన హిందూ పక్షం వారణాసి జిల్లా కోర్టును కోరింది. ఆ అత్యవసర దరఖాస్తును మే 30న కోర్టు విచారించింది. సర్వే నివేదికను బహిరంగపరచడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పక్షం వాదించడంతో హిందువులు ఆ నివేదికను చూపించాలని దరఖాస్తు చేశారు.
https://twitter.com/TimesNow/status/1531294860476567552?s=20&t=Y50mraQ1ZljGPuCArGp1Cg
సర్వే నివేదికను బహిరంగంగా విడుదల చేయమని హిందువుల నుంచి హామీ తీసుకున్న తర్వాత.. వివాదాస్పద నిర్మాణం లోని వీడియోలు, ఫోటోలతో కూడిన సర్వే నివేదికను అన్ని హిందూ వాదులకు అందజేయడానికి కోర్టు అంగీకరించింది.