చరిత్రకారులు, రచయిత ఆచార్య శిప్రముని పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ ముదిగొండ గురు శివప్రసాద్ కు ఆచార్య జీవీఎస్ సాహితీ వార్షిక పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈనెల 13న పురస్కార ప్రదానం ఉంటుంది.
గతంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా, జాతీయ సాహిత్య పరిషత్ అఖిల భారత అధ్యక్షులుగా పనిచేశారు ప్రొఫెసర్ జివి సుబ్రహ్మణ్యం. ఆయన జయంతి సందర్భంగా సాహితీ పురస్కారాన్ని మరో సాహితీ దిగ్గజం ముదిగొండ శివప్రసాద్ కు అందజేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసిన ముదిగొండ శివప్రసాద్..120కి పైగా పుస్తకాలు రాశారు.
భారతీయ ధర్మ ప్రచారం కోసం దేశ, విదేశాలలో అనేక ప్రసంగాలు చేశారు. జాతీయ సాహిత్యపరిషత్ ప్రారంభకుల్లో ఆయనొకరు.
తెలుగు భాషలో వామపక్ష భావజాల ప్రభావంతో చరిత్రను వక్రీకరిస్తూ రచనలు వస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాలలో సాహిత్యంలో జాతీయ భావాలను తిరిగి చిగురింపచేసిన కొద్దిమంది రచయితల్లో ముదిగొండ ముఖ్యులు.