టెక్సాస్‌లోని ఉవాల్డేలోని పాఠశాలలో 19 మంది పిల్లలు, ముగ్గురు పెద్దలను చంపిన కాల్పులు, 2022లో కేవలం 5 నెలల్లో యునైటెడ్ స్టేట్స్‌లోని పాఠశాలలపై జరిగిన సామూహిక కాల్పుల్లో 27వ కాల్పులని NPR నివేదించింది. 2018 నుంచి ఇలాంటి కాల్పులను ట్రాక్ చేసిన ఎడ్యుకేషన్ వీక్ అధ్యయనం ప్రకారం, గత మూడేళ్లలో పాఠశాలల్లో 119 సామూహిక కాల్పులు నమోదయ్యాయి. ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పులు ఈ సంవత్సరంలో జరిగిన 27వ కాల్పుల ఘటన.
తుపాకీతో చేసిన కాల్పుల సంఘటనలను, సంఘటన సమయంలో ఎవరైనా పౌరులు బుల్లెట్ లతో గాయపడ్డ సంఘటనలను సంస్థ ట్రాక్ చేసింది. ఎడ్యుకేషన్ వీక్ అధ్యనంలో K-12 స్కూల్ ప్రాపర్టీ సమీపంలో లేదా స్కూల్ బస్సులో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ వీక్ ప్రకారం, 2021 విద్యా సంస్థలలో ఇటువంటి సంఘటనలు 34 జరిగాయి, సంస్థ తన డేటాబేస్ ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధికం. 2020లో పది కాల్పులు జరిగాయి.. 2019, 2018లో 24 షూటింగ్‌లు జరిగాయి.
https://twitter.com/teamtrace/status/1529255734915043330?s=20&t=mVVpFGrhIf5QlP6BrEC42g
అధ్యనం లో గన్ వయోలెన్స్ జాబితా ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు 212 కాల్పులు నమోదయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని మినహాయించి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కాల్చి చంపబడితే.. సంస్థ ఆ సంఘటనను సామూహిక కాల్పుల జాబితాలో చేర్చింది.
డేటా ప్రకారం, 2021లో యునైటెడ్ స్టేట్స్ లో 693, 2020 లో 611.. 2019లో అమెరికాలో 417 సామూహిక కాల్పుల కేసులు నమోదయ్యాయి.
యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్‌లో జరిగిన ఘోరమైన సామూహిక కాల్పుల్లో, సాల్వడార్ రామోస్‌గా గుర్తించబడిన 18 ఏళ్ల ముష్కరుడు మంగళవారం రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడితో సహా ముగ్గురు పెద్దవారిని చంపాడు. మెక్సికన్ సరిహద్దు నుంచి ఒక గంట దూరంలో ఉన్న ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో మధ్యాహ్న సమయంలో ఈ హత్యలు జరిగాయి. 500 కంటే ఎక్కువ మంది విద్యార్థుల్లో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడినవారు.. పాఠశాలలో రెండవ, నాల్గవ తరగతి వరకు చదువుతున్నారు. హత్యకు గురైన ఉపాధ్యాయురాలిని ఎవా మిరెల్స్ గా గుర్తించారు.
కాల్పులు జరిపిన వ్యక్తి సమీపంలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్న 18 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. షూటర్ తన వాహనాన్ని విడిచిపెట్టి, తుపాకీతో పాఠశాలలోకి ప్రవేశించాడని.. పాఠశాలలో హత్యాకాండకు దిగే ముందు యువకుడు తన సొంత అమ్మమ్మను కాల్చిచంపినట్లు అనుమానిస్తున్నారు. ముష్కరుడిని పోలీసు అధికారులు కాల్చి చంపారు.