తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీదగా టార్గెట్ ఎక్కిపెట్టింది. నయానో భయానో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను బయటకు లాగేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంపు కొట్టేశారు త్వరలో ఇంకా ఎక్కువ సంఖ్యలో చేరికలు ఉంటాయని సంకేతాలు వెలువడుతున్నాయి.
మొదట్లో అసంతృప్తి ఎమ్మెల్యేలతో గులాబీ పార్టీ నేతలు ఫోన్ సంప్రదింపులు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు నేరుగా పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర రావు రంగంలోకి దిగారు. స్వయంగా పిలిపించుకుని ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ మారకుండా ఉండాలని నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజులుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజు ఒక్కో జిల్లా నుంచి ఎమ్మెల్యేలకు పిలుపు వస్తోంది
ఈనేపథ్యంలో బుధవారం మరి కొంత మంది ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ సమావేశమయ్యారు. సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బాండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మీటింగ్ లో చాలా అంశాలపై మాట్లాడుకున్నామని, అవన్నీ సీక్రేట్ అన్నారు. అవన్నీ తర్వాత చెప్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పక్కాగా ప్రణాళికలు రచిస్తోందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎలాంటి సీక్రేట్స్ డిస్కషన్ చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది.
మరి కెసిఆర్ తో భేటీ తర్వాత అయినా గులాబీ ఎమ్మెల్యేలు ఆగుతారా.. లేక ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలోకి జంపు కొడతారా అనేది త్వరలోనే తెలిసిపోతుంది