హెన్రీ జాక్ సన్ సొసైటీ తాజాగా ఇచ్చిన తన “హిందూ ధర్మం పై ద్వేషం” అనే నివేదికలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి. ఛార్లెట్ లిటిల్ వుడ్ అనే ఆమె సుమారు1000మంది హిందూ తల్లి తండ్రులను ఇంటర్వ్యూ చేసి ఈ నివేదిక తయారు చేసారు.
1. బ్రిటిష్ స్కూల్స్ లో హిందూ పిల్లల పై వివక్ష బాగా పెరుగుతోంది.
2. ఆ హిందూ పిల్లలు వాళ్ళ దేవుళ్ళను వివిధ రూపాల్లో పూజించుకోవడం వెక్కిరింపబడుతోంది
3. ఆ పిల్లలు గోవును పవిత్రంగా భావించడం పై వెక్కరింపబడుతున్నారు
4. ముస్లిం విద్యార్థులు హిందూ విద్యార్థులను బహిరంగంగానే కాఫీర్ అని పిలుస్తున్నారు.
5. భారత్ లో ఉన్న కుల, సాంఘీక వివక్షలపై హిందూ విద్యార్థులు హేళనకు గురి అవుతున్నారు.
జూస్ ఎటువంటి వివక్షకు, ద్వేషానికి గురి అవుతున్నారో హిందువులు కూడా అటువంటి వివక్షకు ద్వేషానికి గురి అవుతున్నట్లు ఆ నివేదిక బయట పెట్టింది.
బ్రిటిష్ స్కూల్స్ లో హిందూ ధర్మం గురించి అతి తక్కువ చెప్తారు. అది కూడా అబ్రాహామిక్ కోణం నుండే చెప్తూ హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ, సాంఘిక వివక్షల గురించి ఎక్కువ చెప్తారు. ఇది హిందూ విద్యార్థులపై బెదిరింపులకు, దాడులకు దారితీస్తోంది అని తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు అని ఆ నివేదిక పేర్కొంది.
బ్రిటీష్ వారు భారత్ ను 400 సం.లు పాలించినా ఇక్కడ హిందూ ధర్మం గురించి బ్రిటీష్ పౌరులకు కనిస అవగాహన లేదు. హిందూ విద్యార్థులు ఎక్కువగా శాఖాహారం తీసుకోవడం పైన హేళనకు గురి అవుతున్నారు. ఈ మధ్య ఒక స్కూల్ లో హిందూ పిల్లలపై ఆవు మాంసం విసిరి మీరు ఇస్లాం తీసుకుంటే ఇటువంటి ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు అని ముస్లిం విద్యార్థులు బెదిరించిన సంఘటన జరిగింది అని పేరెంట్స్ ఆరోపించారు.
జకీర్ నాయక్ వీడియోలు చూడమని కొందరు ముస్లిం పిల్లలు బెదిరిస్తూ ఉంటే, మీ దేవుళ్ళను మా జీసస్ నరకంలో వేస్తాడు అని క్రిస్టియన్ పిల్లలు హిందూ విద్యార్థులను బెదిరిస్తున్నారు అని ఆ రిపోర్టు పేర్కొంది.
మతపరమైన జ్ఞానాన్ని బోధించే క్లాస్ టీచర్లు పాఠాలు చెపుతున్న విధానం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి అని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. హిందువులు ఉపయోగించే స్వస్తిక్ గుర్తు హిట్లర్ కి చెందినది అని, హిందూయిజం హిట్లర్ నుండి స్పూర్తి పొందింది అని “సతీ సహగమనం” పాటిస్తారు అని టీచర్లు బోధిస్తున్నారు.
ఈ టీచర్లు వారి పుస్తకాలు లో ఉన్నదే బోధిస్తున్నారు కానీ వీరికి హిందూ ధర్మం పై సరి అయిన అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగటం లేదు అని నివేదిక పేర్కొంది.
బ్రిటన్ లో హిందూలపై వివక్ష పై ఇటువంటి నివేదిక రావడం ఇదే మొదటి సారి. గత సం. లీసెస్టార్ లో హిందూవులపై హిందువుల ఇళ్లపై జరిగిన దాడులు వల్ల ఈ విషయం పై చర్చ మొదలు అయింది. అయితే అప్పుడు జరిగిన సంఘటన లపై నిజాలు ఈ నివేదిక ఇచ్చిన చార్లెస్ లిటిల్ వుడ్ బయట పెట్టి చర్చకు తెర తీసింది. అప్పుడు నిజంగా దాడులకు గురి అయింది హిందువులు అయితే దానికి వ్యతిరేకంగా మీడియాలో వార్తలు వచ్చాలా కొన్ని శక్తులు చూసాయి అని ఆమె ఋజువు తో బయట పెట్టింది.
-చాడాశాస్త్రి