గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ వెళ్లారు. అయితే ఆమె పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరుకాలేదు. ఆలయ అధికారులే ఆమెకు స్వాగతం పలికారు.
ఇక ఆమె పర్యటన కోసం హెలికాఫ్టర్ ఏర్పాటు చేయకపోవడంతో కొత్తగూడెం వరకు తమిళిసై రైల్లో ప్రయాణించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో గవర్నర్‌కు అడిషనల్ కలేక్టర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆమె రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.
మేడారం జాతర కోసం కూడా హెలికాఫ్టర్ ఏర్పాటు చేయాల్సిందిగా అడిగితే ప్రభుత్వం పట్టించుకోలేని ఢిల్లీలో తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకుముందున్న గవర్నర్ నరసింహన్ ఎప్పుడు భద్రాచలానికి వెళ్లినా ప్రభుత్వం హెలికాఫ్టర్ సౌకర్యం కల్పించేదని …తమిళిసై విషయంలో మాత్రం ప్రభుత్వ తీరు సరిగా లేదని పలువురు గుర్తుచేస్తున్నారు. ఇక సీఎంవోలో పనిచేసే ఓ అధికారి ఎప్పుడు భద్రాచలం జిల్లా పర్యటకు వచ్చినా హెలికాఫ్టర్ ఏర్పాటు చేసేవాళ్లని ఆ జిల్లాకు చెందిన వాళ్లు చెప్పుకుంటున్నారు. ఇటీవ యాదాద్రి పర్యటన సందర్భంగా కూడా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. మేడారం జాతరకు హెలికాప్టర్ ఏర్పాటు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఢిల్లీలో మీడియా ముఖంగా తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యనే ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఆమె రాష్ట్రసర్కారు తీరుపై ఫిర్యాదు చేశారు. మీడియాముఖంగా తన అసంతృప్తి వెల్లగక్కారు.
అటు ఉదయం గవర్నర్ దంపతులు సీతారాముల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి తమిళిసై పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)