అందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులు వినూత్నంగా వెళ్తున్నారు. రాష్ట్రంలో 36 జిల్లాలుండగా వ్యాక్సినేషన్లో ఔరంగాబాద్ జిల్లా 26 వ స్థానంలో ఉంది. దీంతో కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు మాత్రమే రేషన్ ఇవ్వాలని ,,,అస్సలే తీసుకోని వారికి సరఫరా నిలిపేయాలని ఆదేశించింది. అంతేకాదు…. టీకా తీసుకోని వాళ్లను పట్టణంలోని చారిత్రక ప్రదేశాల దగ్గరకు అనుమతించవద్దని ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు.
రేషన్ మాత్రమే కాదు టీకా వేసుకోని వాళ్లకు గ్యాస్ , పెట్రోల్ కూడా అందించవద్దని … టీకా ధ్రువీకరణ పత్రం చూపిస్తేనే ఇవ్వాలని ఆదేశించారు.
ఈ ఆదేశాలను పాటించకుంటే సంబంధిత వ్యక్తులపై విపత్తు నిర్వహణ చట్టం(Disaster Management Act), అంటువ్యాధుల చట్టం(Epidemic Diseases Act) కింద చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.