తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్ములోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
62 ఎకరాల ప్రాంగణంలో అందమైన శివాలిక్ అడవుల నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం.. జూన్ 3వ తేదీన పుణ్యాహవచనంతో ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.
చివరి రోజైన గురువారం జరిగిన ధ్వజాహరోహణం, సర్వదర్శన ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి హాజరయ్యారు. శ్రీవారి ఆలయం.. జమ్ము ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.
#WATCH | Jammu: Visuals of Tirupati Balaji temple, which will be inaugurated virtually by Union Home Minister Amit Shah today
The temple has been built on 62 acres of land with approx cost of Rs 25 crores and construction work was completed in a span of two years pic.twitter.com/OJFYWdprmJ
— ANI (@ANI) June 8, 2023