అదిలాబాద్ (మైండ్ మీడియా) : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురువందనం కార్యక్రమం జడ్పీ మీటింగ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వృత్తినే దైవంగా భావిస్తూ అంకితభావంతో పేద విద్యార్థుల అభ్యున్నతికై పని చేస్తున్న జిల్లావ్యాప్తంగా ఉన్న 50 మంది ఉపాధ్యాయులను సంఘ పక్షాన శాలువా, మెమంటో, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ ఆదర్శ సమాజాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని, ఉపాధ్యాయులు ఆదర్శవంతమైన జీవనం సాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి PM శ్రీ, బేటి బచావో బేటి పడావో, పడే భారత్ బడే భారత్, ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్, నూతన జాతీయ విద్యా విధానం 2020, అటల్ టింకరింగ్ ల్యాబ్ యోజన లాంటి పథకాలు అమలు చేస్తుందని, దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప ప్రగతి సాధిస్తుందంటే ఉపాధ్యాయులే కారణమని, భారతదేశం ఎందరో మందే గొప్ప గురువులను ప్రపంచానికి అందించిందని మరియు జిల్లాలో విద్యాభివృద్ధికి తన వంతు సహకారం కృషి అందిస్తానని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమాజ నిర్మాతలని టీచర్స్ ఆర్కిటెక్చర్స్ అండ్ బిల్డర్ ఆఫ్ సొసైటీ అని ఉపాధ్యాయులని గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. టీచర్స్ పైన ఉన్న చిన్నచూపుపొవాలని , క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, గురువందన కార్యక్రమం చేస్తూ తపస్ ఉపాధ్యాయులను సంతోషకరమని అన్నారు. ఏ సంఘం చేయని గురు వందన కార్యక్రమం తపస్ మాత్రమే చేయడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని నాని, బడ్జెట్లో రెండు లక్షల 91,000 కేటాయిస్తే విద్యారంగానికి కేవలం 21 వేల కోట్లు కేటాయించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ డి ఎలు , పి ఆర్ సి ప్రకటించాలని, 317 జీవో బాధితులందరికీ సత్వరమే న్యాయం చేయాలని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన అదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి టామ్నే ప్రణీత మాట్లాడుతూ తపస్ ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని, జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తపస్ సంఘానికి సహకరిస్తానని, ఉపాధ్యాయులందరూ కష్టపడి పనిచేసే విద్యా శాఖకు మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన తపస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కానుగంటి హనుమంతరావు సురేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతోపాటు ఉపాధ్యాయుల విద్యార్థుల్లో దేశభక్తి జాతీయభావం పెంపొందించడం కోసం కృషి చేస్తుందని తమ సంఘం అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని, ప్రభుత్వం విద్యకు నిధులు పెంచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ ఎన్ వి శివకుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని పాఠశాల తరగతి గది చాలా ముఖ్యమైనదని, ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్య అందించి మంచి విద్యార్థులను తయారు చేయాలని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి జాతీయభావం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, దేశ భవిష్యత్తుని నిర్ణయించేది ఉపాధ్యాయుడేనని ఇంతకన్నా గొప్ప ఎవరూ లేరని, వేదాలు శాస్త్రాలు ప్రపంచానికి అందించింది భారతీయులేనని అన్నారు. ఆర్యభట్ట,వరాహ మీరుడు, చరుకుడు, శుశృతుడు, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి గొప్ప గురువులని ప్రపంచానికి అందించిందని, ఉపాధ్యాయునిగా హక్కులే కాకుండా విధులకు కూడా ప్రముఖ్యం ఇవ్వాలని దేశ సమైక్యత, సమగ్రత కోసం విద్యార్థులను గొప్ప దేశభక్తులుగా తయారు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలభోజు గోపికృష్ణ
ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ ఏవీఎన్ రెడ్డి , జిల్లా విద్యాశాఖ అధికారి టి ప్రణీత , రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవత్ సురేష్ , ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డివి రావ్, అదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, ట్రస్మా అదిలాబాద్ ప్రధాన కార్యదర్శి ఆదినాథ్, జిల్లా నాయకులు నారాయణ, మెస్రం రాజ్ కుమార్, మనోజ్ రెడ్డి, గోమంత్ రెడ్డి,బత్తుల గంగాధర్,యాదవ్ రావ్, జాదవ్ సురేష్, అంబాజీ, గోపాల కృష్ణ, వివిధ మండలాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.