రాష్ట్ర ప్రభుత్వంతో తన వ్యవహారశైలి పదును మరింత పెంచారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇటీవల ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, సీఎం వ్యవహారశైలిపై విరుచుకుపడ్డ ఆమె.. తాజాగా ఖమ్మం జిల్లాలో సామినేని సాయి గణేష్, కామారెడ్డి జిల్లాలో రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. వీటిపై గవర్నర్ సీరియస్ అయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల వేధింపుల కారణంగానే వీరు ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి వీటిపై వినతి పత్రం ఇచ్చారు. ఆ రెండు సంఘటనలపై నివేదిక ఇవ్వాల్సిందిగా గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)