తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్పందించారు. సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయడం చాలా కష్టమని గవర్నర్ స్పష్టం చేశారు. సీఎం చెప్పారని ఫైల్ పై సంతకం చేయడానికి, తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ని కాదన్నారు తమిళిసై. ఢిల్లీ వెళ్లిన వెంటనే నాపై అసత్య ప్రచారం మొదలెట్టారని వాపోయారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నన్ను విమర్శించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా సీఎంలు నియంతలుగా మారుతున్నారని, ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నా… ఇద్దరూ భిన్నమైనవారని గవర్నర్ అన్నారు. ఇది ప్రజాస్వాయ్యనికి మంచింది కాదని తమిళిసై పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారని.. ఇప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారని తమిళిసై అన్నారు. తనను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది వాస్తవం కాదని తమిళిసై స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ ప్రభుత్వంతో నడుస్తున్న ప్రోటోకాల్ వివాదంపైనా ఆమె స్పందించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు.. రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు.
చెప్పిన వెంటనే సంతకం చేయడానికి రబ్బరు స్టాంప్ ను కాదు – సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు

Share: