ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అందుకు ఉగాదిని ముహూర్తంగా నిర్ణయిస్తూ…ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా వార్డు, గ్రామ వార్డు వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది.. సేవా వజ్రకు రూ.30 వేల నగదు, సేవా రత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారాన్ని అందించి, శాలువాతో సత్కరించనుంది. నవరత్నాల అమలులో చూపిన చొరవ, కోవిడ్, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయనున్నట్టు అధికారులు తెలిపారు.