ఇస్కాన్ గురువు చిన్మోయి కృష్ణదాస్ మీద బంగ్లాదేశ్ ప్రభుత్వం పగబట్టింది. ఆయన్ని జైల్లోనే ఉంచి హింసించేందుకు పట్టుదలతో ఉంది. కృష్ణదాస్ తరఫున కనీసం బెయిల్ కోసం వాదించేందుకు కూడా లాయర్లను రానివ్వడం లేదు. దీంతో ఇప్పట్లో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కల్పించడం లేదు.
తాజాగా చిట్టగాంగ్ కోర్టులో చిన్మోయ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఆయన తరపున కనీస వాదనలు వినిపించేందుకు కూడా న్యాయవాది లేకపోవడంతో పిటిషన్ వాయిదా పడింది. ఈ విచారణను వచ్చే ఏడాది జనవరి రెండో తేదీకి వాయిదా వేసింది. కోర్టు రూమ్‌కు డిఫెన్స్ లాయర్ ఎవరూ హాజరు కాలేదని, దీంతో బెయిల్‌ను వాయిదా వేస్తున్నట్లు చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సైఫుల్ ఇస్లామ్ ఆదేశాలు ఇచ్చారు. అంటే నెలరోజుల దాకా ఆయన బెయిల్ పిటిషన్ మీద వాదనలు లేనట్లే.
మరోవైపు, చిన్మోయ్ కృష్ణదాస్ కోసం ముందుకు వచ్చిన న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆయన కోసం పనిచేస్తున్న ఇస్కాన్ న్యాయవాదిని ఇప్పటికే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఆ లాయర్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు.
కొత్త న్యాయవాదులు రాకుండా పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. బెయిల్ విచారణకు హాజరు అవుతారన్న నేపథ్యంలో సుమారు 70 మంది హిందూ లాయర్లపై కేసులు పెట్టారు. దీంతో బంగ్లాదేశ్ లో చిన్నోయి కృష్ణదాస్ తరఫున నోరు విప్పడానికి కూడా లాయర్లు భయపడిపోతున్నారు. న్యాయవాదుల పరిస్థితి ఇలా ఉంటే ,, ఇక మిగిలిన ప్రజానీకం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
.ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారామన్ దాస్ ప్రకారం, న్యాయవాది రాయ్ యొక్క ఏకైక “తప్పు” అతను చిన్మయ కృష్ణదాస్ కోసం కోర్టులో వాదించడం మాత్రమేనని, అందువలన ఇస్లామిస్టుల బృందం అతని ఇంటిని దోచుకుందని, తీవ్రంగా గాయపడిన రాయ్‌ను ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. ఐసియులో ఉన్న రాయ్ చిత్రంతో పాటు, అతను ఎక్స్ లో పోస్ట్ చేశారు.
దీనిని బట్టి చిన్మోయి కృష్ణదాస్ మీద బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పగబట్టింది అని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే హిందూ మత సంస్థలను దేశం నుంచి వెళ్ళగొట్టడానికి తీవ్రమైన కుట్ర జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు.