జమ్ముకశ్మీర్ నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఏ ఇస్లామీ పై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. సంస్థకు చెందిన వందల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది .షోపియాన్ జిల్లాలో సంస్థకు చెందిన రెండు పాఠశాల భవనాలు సహా తొమ్మిది ఆస్తులను స్వాధీనంచేసుకుంది. వాటి విలువ వందల కోట్ల విలువచేస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్ఐఏ సంస్థకు చెందిన 188 ఆస్తులను జప్తు చేసింది. జమాతేకు షోపియాన్ ఎంతో కీలకం. అతిపెద్ద రాజకీయ, మతపరమైన సంస్థ అయిన జమాత్ ఏ ఇస్లామీకి భారీ నెట్వర్క్ ఉండేది. ఉగ్రవాదానికి సంస్థ మద్దతిస్తోందని చాలా ఆరోపణలు వచ్చాయి. కశ్మీర్ ఉగ్రసంస్థ హిజ్బుల్ మొజాహిదీన్ కు ఈ సంస్థనే మార్గదర్శి. 2019లోనే కేంద్రం ఈ సంస్థను నిషేధించింది. నాటి నుంచి సంస్థ ఆస్తుల జప్తును వేగవంతం చేసింది ఎన్ఐఏ. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధకచట్టం ఉపా కింద ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపిందే.
https://twitter.com/SumitDefence/status/1590635057206943744?s=20&t=3FnGdxRJKWU6RUuDW5PiUQ