యూపీ గోరఖ్ నాథ్ మఠం దగ్గర కత్తితో దాడియత్నం చేసి, లోపలకు వెళ్లేందుకు యత్నించిన అహ్మద్ ముర్తజాకు ఐసీస్ తో సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. ఆ ఉగ్రసంస్థకు ముర్తజా సహా పలువురు నిరంతరం నిధులు అందజేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు తన బ్యాంకు ఖాతాల ద్వారా దాదాపు రూ.8.5 లక్షల మేరకు ఐసిస్ కార్యకలాపాల కోసం అందజేసినట్లు తెలిపారు.యూరప్, అమెరికా సహా పలు దేశాల్లోని ఐసిస్ మద్దతుదారుల సంస్థల ద్వారా ఆ సొమ్మును ఐసిస్ కు చేరవేసినట్టు గుర్తించారు. గోరఖ్‌నాథ్ మఠం వద్ద భద్రతా సిబ్బంది నుంచి రైఫిల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారని, దాంతో భారీదాడికి దుండగులు యత్నించారు.
2014లో బెంగళూరు పోలీసులకు చిక్కిన మెహందీ మసూద్ తో ముర్తజా సామాజికమాధ్యమాల ద్వారా మాట్లాడుతున్నట్టూ తేలింది. ముంబై ఐఐటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ముర్తజా ఏప్రిల్ 3న గోరఖ్ నాథ్ మఠం దగ్గర హల్ చల్ చేశాడు. అక్కడున్న సిబ్బంది, పోలీసులు అడ్డుకోబోతే వారిపై దాడి చేశాడు. భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను గోరఖ్ పూర్ జైల్లో ఉన్నాడు.