తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఊరట లభించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) సెక్రటరీ అనితా రామచంద్రన్ తాజాగా ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. 503 పోస్టులతో నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక మొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇది.
ఇందులో అత్యధికంగా 91 డీఎస్పీ పోస్టులు ఉండగా మరో 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోస్టులు, 42 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయని టిఎస్పీఎస్సీ తమ ప్రకటనలో వెల్లడించింది. గ్రూప్ 1 ఆశావహులు మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు TSPSC వీలు కల్పించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన జీవో 55 ప్రకారం, గ్రూప్ -1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులున్నాయి. తాజా జీవో ప్రకారం గ్రూప్ -1 మెయిన్స్‌ను 900 మార్కులు, గ్రూప్-2ను 600 మార్కులకే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇంటర్వ్యూల రద్దుతో గ్రూప్ -1లో 100 మార్కులు, గ్రూప్ -2లో 75 మార్కులను తొలగించింది.
విభాగాల వారీగా ఖాళీలివే: 503
డిప్యూటీ కలెక్టర్లు – 42
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీసర్ – 91
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ – 48
రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ – 4
జిల్లా పంచాయతీ ఆఫీసర్ – 5
జిల్లా రిజిస్టర్ – 5
జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు – 2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ – 8
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ – 26
గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు – 41
అసిస్టెంట్ డైరెక్టర్ (సోషల్ వెల్ఫేర్) – 3
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు – 5
జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 2
జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ – 2
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్(పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) – 20
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు – 40
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులు – 121
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)