టి20 ప్రపంచ కప్ భారత్ దేశానికి తీపి గుర్తులు మిగులుస్తోంది. మొన్ననే ప్రపంచ కప్ గెలుచుకుని భారత సేన ఇంటికి తిరిగి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి పిలిపించుకొని అభినందించి పంపించారు. దేశమంతా క్రికెట్ టీం పేరు మార్మోగిపోతోంది.
ఈ లోగా భారత్ కు మరొక గుడ్ న్యూస్ అందింది. వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచిన పాండ్యా రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 222 పాయింట్లతో హసరంగతో సమానంగా నిలిచాడు.
వరల్డ్ కప్‌లో ఆటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాట్‌తో ఆకట్టుకోగా అదే సమయంలో జట్టుకు అవసరమైన సమయంలో బంతితోనూ మ్యాజిక్ చేశాడు. 150 కంటే ఎక్కువ స్ట్రయిక్ రేట్‌తో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్ల తీశాడు. కీలమైన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌తో పాటు రబాడా వికెట్లు తీసి మ్యాచ్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను నెగ్గేందుకు సహకారం అందించాడు.
ఇక ప్రపంచకప్‌లో 15 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 12 స్థానాలు మెరుగుపరుచుకొని 12వ స్థానానికి చేరుకున్నాడు. టాప్-10 బౌలర్లలో అక్షర్‌పటేల్, కుల్దీప్ యాదవ్ చోటు సంపాదించారు. టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అర్షదీప్ సింగ్ 13వ స్థానానికి చేరాడు. ఇక శ్రీలంక బౌలర్ హసరంగ రెండో స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ మూడోస్థానంలో ఉన్నాడు.
మొత్తం మీద క్రికెట్లో భారత్ తనమైన శైలిలో దూసుకెళుతోంది. అందుకే మన ఆటగాళ్లకు అంతా జేజేలు పలుకుతున్నారు.