జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవుతోంది. ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలు ఒక్కొక్కటిగా దూరం జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కు శత్రువుగా మారింది. అదే బాటలో తృణమూల్ , సమాజ్ వాది వంటి పార్టీలు నడుస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కూటమిలో చిచ్చుపెట్టాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ,, ఆప్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తూ పరస్పరం తిట్టుకుంటున్నాయి. అయితే,, ఇతర మిత్ర పక్షాలు అయిన
టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన – యూబీటీ వంటివి …. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇస్తున్నాయి.
ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు., పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు.
తమకు మద్దతిచ్చినందుకు మమతకు కేజ్రీవాల్.. ఈ పోస్ట్ లో ధన్యవాదాలు తెలిపారు. కష్టసుఖాల్లో అండగా ఉంటూ, ఆశీర్వదిస్తున్నందుకు మమత దీదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతుంది. ఢిల్లీ ఎన్నికల్లో బెంగాలీ, బీహారి ఓట్లు ప్రభావం చూపిస్తాయి.
శివసేన – యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కేజ్రీవాల్ మంతనాలు జరుపుతున్నారు . ఉద్ధవ్ మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో ఆప్ తరపున ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. అలాగే సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కూడా ఆప్ మంతనాలు సాగిస్తోంది.
తరుచుగా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడుతూ వస్తోంది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించుకొంది. ఫలితంగా కాంగ్రెస్ కూడా ఒంటరి పోరాటాన్ని ఎంచుకుంది. అయితే తృణమూల్, సమాజ్ వాది వంటి పార్టీలు కలిసి వస్తాయి అని ఆశలు పెట్టుకొంది. కానీ ఈ ఆశలు వమ్ము అవుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం జాతీయ రాజకీయాల్లో కూడా కనిపించవచ్చు. రాగల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రపక్షాలు దూరం జరుగుతాయి అన్నమాట బలంగా వినిపిస్తోంది.