కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు.
జమ్మికుంటలోని శంకర నందనహ గార్డెన్స్ లో జరిగిన ఈసభకు పెద్ద ఎత్తున గొల్లకురుమలు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, మహిపాల్ యాదవ్, రవీందర్ కురుమ, మల్లేష్ యాదవ్, సురేష్ యాదవ్, సాయిబాబా యాదవ్ తదితరులు హాజరయ్యారు.
డోలు కొట్టి సభను ప్రారంభించిన దత్తాత్రేయ గారు.
ముల్కనూరులో స్వాతంత్ర సమరయోధులు పడాల చంద్రయ్య విగ్రహాన్నీ దత్తాత్రేయ ఆవిష్కరించారు.
కుటుంబ సభ్యునిగా ఆదరించి ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు ఆనందంగా ఉందని దత్తాత్రేయ అన్నారు.
కొమరవెల్లి మల్లన్న ఆశీర్వాదం తో వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.