చాలమందికి గోవా ఆంటే షిప్పింగ్, ఆయిల్ వ్యర్థాలతో నిండిన కలన్ ఘాట్, కండోలిమ్ పాలోలం, బీచ్ లో విహారం , మందెయ్యడం నైట్ డిస్కోలు ,క్యాసినో, రాయల్ ప్రైడ్ ఎక్కడం తిరిగిరావడం అనుకుంటారు..
కానీ గోవా చుట్టుపక్కల కనువిందుచేసే ప్రకృతి అందాలు ఎన్నోఎన్నెన్నో.
సముద్రం నీరు క్రిస్టల్ క్లియర్ గా ఉండే వెగటార్ బీచ్ తో పాటు ఎన్నో సీక్రెట్ బీచెస్ , బటర్ ఫ్లై ,నేత్రాని,అగట్టి కనకోన లాంటి ఎన్నో ఐల్యాండ్స్ ఉన్నాయక్కడ.
బగా నుండి మపూసా మీదుగా ఓ 30 కిలోమీటర్ల దూరంలో హార్వాలం అని ఓ వాటల్ ఫాల్ ఉంటుంది. పనాజీ నుంచి మార్సెల్లా విలేజ్ మీదుగా ఓ రొడ్డు ఉంటుంది.
అదొక అద్బుతం ఆ పక్కన్నే రాతి గుహలు ,రుద్రేశ్వర్ దేవాలయం… లోకేషన్ సూపర్ గా ఉంటుంది…
ఇదేకాక ఇంకో అయిదారు వాటర్ ఫాల్స్ ఉంటాయి ..
వర్షాకాలంలో వెళ్తే ఆ అద్భుతాల్ని ఎంజాయ్ చేయవచ్చు.
ఈ సారి గోవా వెళ్లినప్పుడు రోటీన్ గా కలన్ ఘట్ భగా కాకుండా రొటీన్ కి భిన్నంగా గోవా సీక్రెట్ బీచేస్ చుట్టుపక్కల వెస్ట్రన్ ఘాట్స్ మీదా ఓ లుక్కేయ్యండి…