గీతా జయంతి సందర్భంగా శ్రీసరస్వతి శిశుమందిర్ బాన్సువాడ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బొప్పిడి భూమి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు భగవద్గీత అష్టాదశ యోగాల్లోని శ్లోకాలను పాడారు. కార్యక్రమ విశిష్టతను ఇందుర్ విభాగ్ శిక్షనిక్ ప్రముఖ్ పక్కి శ్రీనివాస్ వివరించారు. ‘మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు యావత్ భారతదేశం అంతా భగవద్గీతను చదవాలి శ్రీకృష్ణుడు గీతను అర్జునునికి బోధించిన రోజును గీతా జయంతిగా జరుపుకుంటాము భగవద్గీత పుట్టుక మొదలుకొని మరణం వరకు మానవుడు తన జీవితం సమాజంలో ఏ విధంగా ఉండాలో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో తెలియజేస్తుంది. ప్రతి సమస్యకు సమాధానం భగవద్గీత ద్వారా తెలుస్తుంది’ అని ఆయన అన్నారు.