హిందూ మహిళతో ముస్లిం పురుషుడి రెండో వివాహం చెల్లదని గౌహతి హైకోర్టు తీర్పుచెప్పింది. ఆ వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లోని సెక్షన్ 4 కాపాడబోదంది. షహబుద్దీన్ అహ్మద్ అనే వ్యక్తి రెండో భార్య దీపమణి కలిత వేసిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది.
2017లో రోడ్డు ప్రమాదంలో అహ్మద్ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పింఛను, ఇతర ప్రయోజనాలను అధికారులు మంజూరు చేయలేదు. దీంతో ఆమె కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ప్రత్యేక వివాహ చట్టం, 1954లోని సెక్షన్ 4ను హైకోర్టు ప్రస్తావిస్తూ…భర్త లేదా భార్య బతికుండగా మరో పెళ్లి చేసుకుంటే అది చెల్లదనే నిబంధనను కోర్టు గుర్తు చేస్తూ తీర్పునిచ్చింది. పిటిషనర్, షహబుద్దీన్ అహ్మద్ చేసుకున్న పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించేనాటికి ఆయనకు ఓ భార్య ఉందని.. మొదటి భార్యతో ఆయన వివాహం రద్దయినట్లు తెలిపే డాక్యుమెంట్ ఏదీ లేదని పేర్కొంది. ఆమె తరపున వేసిన రిట్ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు..మైనర్ అయిన ఆమె కుమారుడికి మాత్రం పింఛన్, ఇతర ప్రయోజనాల్లో వాటా పొందే హక్కు మాత్రం ఉందని తెలిపింది.