కర్నాటకలో బలవంతపు మతమార్పిళ్లు ఎక్కువవుతున్నాయి. తాజా ఓ హిందూ వ్యక్తిని కొందరు బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అందుకోసం గొడ్డు మాంసం తినిపించారు. నిందితులు నవా ముస్లింలు పేరుతో గ్రూపుగా ఏర్పడి ఖురాన్, ఇరాక్ దేశాల నుంచి వచ్చిన వారినుంచి నిధులు రాబట్టేందుకు ఇస్లాంలోకి మారుస్తున్నట్టు వెలుగుచూసింది.
ఓబాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.అతన్ని బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన కాంగ్రెస్ కు చెందిన బెంగళూరు మాజీ కార్పొరేటర్ అన్సర్ పాషా, అతని సోదరుడు నయాజ్ పాషా, హాజీసాబ్, అతార్ రెహ్మాన్, షోయబ్ లను గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని ముందుగా అరెస్ట్ చేయగా…మిగిలిన ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు. నయాజ్ పాషాను తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు.
మాండ్యాకు చెందిన శ్రీధర్ మొదట్లో డబ్బు ఆశ చూపి మతమార్పిడికి ఒత్తిడి చేసినట్టు విచారణలో వెల్లడైంది. ముందుగా 50 వేలు చెల్లించినట్టు తెలిసింది. అయితే తరువాత అతను పూర్తిగా ముస్లింగా మారేందుకు ఒప్పుకోలేదు. దీంతో అతనిపై ఒత్తిడి తెచ్చారు. తన అనుమతి లేకుండా తన పేరును మహ్మద్ సల్మాన్ గా మార్చినట్టు దళితుడైన శ్రీధర్ అనే ఆ యువకుడు ఫిర్యాదు చేశాడు.
#Breaking | Shocking case of alleged conversion in #Karnataka. 25-year-old shares ordeal with CNN-News18, says converted and made to eat beef!
@ritsrajpurohit with the details
Join the broadcast with @shilparathnam | #Exclusive pic.twitter.com/atfd6o9tWe
— News18 (@CNNnews18) October 13, 2022
నిందితులు ‘నవా ముస్లింలు’ అనే పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడి ఇరాన్, ఇరాక్ దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా చాలామంది ముస్లిమేతరులను ఇస్లాంలోకి మారుస్తున్నారని శ్రీధర్ తెలిపాడు.డబ్బు అవసరం ఉన్నవారికి వీరు ఎర వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తాము తీరుస్తామని ముందుగా స్థానిక మసీదుకు తీసుకెళ్తారు. అక్కడే హిందూ దేవీదేవుళ్లను కించపరుస్తూ అల్లాయే నిజమైన దేవుడని కౌన్సెలింగ్ ఇస్తారు.
అలా సమీపంలోని అన్నిమసీదులకు తీసుకెళ్లి ఖురాన్ నేర్పిస్తారు. ఇక శ్రీధర్ కైతే ఏదో ద్రావకం ఇచ్చి సుస్తీ చేయించారని వాపోయాడు. గొడ్డు మాంసం సైతం తినిపించారని ఫిర్యాదు చేశారు. ప్రతిఘటిస్తే రివాల్వర్‌తో బెదిరించారని పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరయ్యాడు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో శ్రీధర్ కుటుంబం ఉంది. అయితే వాళ్ల అరాచకాలు ఎక్కువవడంతో ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించినట్టు శ్రీధర్ తెలిపాడు.