ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి సందర్శించారు. కోవిడ్ వార్డులను పరిశీలించారు. సీఎం హోదాలో మొదటిసారి ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఆయనతో పాటు హరీశ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతుల గురించి ఆస్పత్రి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే లోపలకు వెళ్లి పేషెంట్లతోనూ మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో సుమారు 18 వందలకుపైగా బెడ్లు ఉన్నాయి. ధైర్యంగా ఉండాలని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు సీఎం చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు. కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించారు.కాగా సీఎం పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగులసహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.