పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్మీడియాలో కూడా ఎంతో ఆక్టివ్ గా ఉంటుంటారు. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై ట్విట్టర్లో స్పందిస్తుంటారు. సందేశాత్మక ట్వీట్లూ చేస్తుంటారు. ఇక వీకెండ్లో ఆయన చేసిన ఓ ట్వీట్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తోంది. డాక్టర్ల చేతిరాత మారే క్రమాన్ని తెలిపే ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. అందులో టెన్త్ ఇంటర్, ఎంబీబీఎస్, జూనియర్ డాక్టర్, స్పెషలిస్ట్ వరకు చేతిరాత ఎలా మారుతుందో ఆ వీడియోలో ఉంది. పదోతరగతిలో స్పష్టంగా అర్థమయ్యే చేతిరాత…డాక్టర్ అయ్యాక ఏమీ అర్థంకాకుండా ఉంటుంది. 15 సెకన్ల నిడివిగల ఆ వీడియో సరదాగా ఉంది.
Hilarious. But true… pic.twitter.com/b3uoFIIm1R
— anand mahindra (@anandmahindra) September 4, 2022