జార్ఖండ్ రాష్ట్రంలో అంబులెన్స్ లకు ఇచ్చినట్టు స్కూల్ బస్సు లకు దారి ఇవ్వాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. శుక్రవారం డోరాండాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్ 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎండలు బాగా ఉన్నాయని ఇటువంటి పరిస్థితిలో చిన్న పిల్లలు త్వరగా ఇంటికి చేరుకునేలా అంబులెన్స్ లకు ఏ విధంగా దారి ఇస్తారో అలాగే పాఠశాల బస్సులకు దారి ఇవ్వాలని వాహనదారులకు సూచించారు.
జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాలు బుధవారం వరకు వేడిగాలులతో అల్లాడిపోయాయి. గత 24 గంటల్లో కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గిందని వాతావరణ అధికారులు తెలిపారు.
జార్ఖండ్ అంతటా వేడిగాలుల పరిస్థితుల దృష్ట్యా, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ ఇటీవల పాఠశాల సమయాలను సవరించింది. విద్యా సంస్థలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేయాలని ఆదేశించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)