అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం శివరామరెడ్డి కాలనీలో తాగునీటి పైపులైన్ పగిలిపోవడంతో స్థానికులు మంచినీటి కోసం పడుతున్న అవస్థ ఇది..
చాలా కాలంగా ఇలా మురుగు కాలువలో దిగి పగిలిపోయిన పైపు నుంచి తాగునీరు పట్టుకుంటున్నారు..
దీనివల్ల అనేక రోగాలబారినపడి ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోందని వాపోతున్నరు మహిళలు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు ..