హెలికాప్టర్ క్రాష్.. రాఫెల్ విమానాల తయారీ సంస్థ ఓనర్ మృతి.
అత్యాధునిక యుద్ధ విమానాలైన రాఫెల్ జెట్స్ తయారీ సంస్థ అయిన డస్సాల్ట్ ఓనర్ ఒలివర్ డస్సాల్ట్ మృతిచెందారు. ఆయన వయస్సు 69 ఏళ్లు. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒలివర్ డస్సాల్ట్ ఒకరు. ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ట్విట్టర్లో పేర్కొంది. దేశాన్నిఎంతగానో ప్రేమించే ఒలీవర్ డస్సాల్ట్ మృతి ఫ్రాన్స్‌కు తీరని లోటని.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ అన్నారు.
కాగా, ఒలివర్ డస్సాల్ట్ ప్రస్తుతం ఫ్రాన్స్ పార్లమెంట్ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇయన సంస్థకు చెందిన యుద్ధ విమానాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది కూడా ఒలివర్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థనే.