యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అఖిలేశ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత కొద్దిరోజులుగా ఆయన స్వల్ప జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు. గత కొద్ది రోజులుగా ఆయన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించారు. కాగా, గత కొద్ది రోజులక్రితం ఆయన కరోనా టీకాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీసుకువచ్చిన వ్యాక్సిన్‌ను తాను వేసుకోనన్నారు.
https://twitter.com/ANI/status/1382193925599817728